జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పారదర్శకత కోసం 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి నిఘా వేదికను ఏర్పాటు చేశామని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఈ వేదికకు ఆయన సమన్వయకర్తగా పనిచేయనున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.
మహానగరపాలక సంస్థలో ప్రజాసమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కృషి చేయాలని నిఘా వేదిక అభిప్రాయపడింది. ఎన్నికల్లో నేరచరితులకు రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. నేరచరిత గల అభ్యర్థులెవరైనా ఎన్నికల్లో నిలబడితే వారి వివరాలను ఓటర్లకు వెల్లడిస్తామని నిఘావేదిక సమన్వయకర్త పద్మనాభరెడ్డి అన్నారు.