ETV Bharat / state

నేడే ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నానికి తొలి ఫలితం - ghmc civic polls

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. కొద్ది గంటల్లో బల్దియా పీఠం ఎవరిదో తేలిపోనుంది. 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మెజార్టీ డివిజన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ghmc results
నేడే ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నానికి తొలి ఫలితం
author img

By

Published : Dec 4, 2020, 5:16 AM IST

గ్రేటర్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు 30 కేంద్రాల్లో జరగనుంది. డివిజన్ల వారీగా కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో లెక్కింపు చేపడతారు. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు.

ఏజెంట్లకు రిలీవింగ్ లేదు..

అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంటుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఎస్ఈసీ, ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఏజెంట్లకు రిలీవింగ్ సౌకర్యం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లను నిషేధించారు. ఏజెంట్లందరూ విధిగా ముందుగానే రిటర్నింగ్ అధికారుల వద్ద పాసులు తీసుకోవాలి. పాసులు లేని వారికి అనుమతి లేదని ఎస్​ఈసీ తెలిపింది.

మధ్యాహ్నం మూడు గంటల్లోపు..

మొదటగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత రెగ్యులట్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు. మొదటగా పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ప్రాథమిక లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల్లోపు, మెజార్టీ వార్డుల పూర్తి లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఒక్కో రౌండ్​లో 14,000 ఓట్లు..

మొదటి విడతలో బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్లను మడతలు విప్పకుండా 25 చొప్పున కట్టలుగా కడతారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్‌తో సరిచూసి ఆ కట్టలను ఆర్వో టేబుల్ వద్ద ఉన్న డ్రమ్ములో వేస్తారు. రెండో దశలో 14 టేబుళ్లకు ఒక్కో టేబుల్‌కు 40 బండిళ్లు, వెయ్యి బ్యాలెట్లను ఇచ్చి అభ్యర్థుల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్​లో 14,000 ఓట్లు లెక్కిస్తారు. ప్రతి రౌండు అనంతరం ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. సందేహాత్మక బ్యాలెట్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎస్ఈసీ స్పష్టం చేసింది. పరిశీలకుని అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు.

ఆర్వోదే నిర్ణయం..

ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే ఫలితం ప్రకటించడాని కంటే ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. వారు పేర్కొన్న కారణాలను పరిగణలోకి తీసుకొని రీకౌంటింగ్ విషయమై ఆర్వో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే వారంతా పీపీఈ కిట్లను ధరించాలని పేర్కొంది. కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పక ధరించాలని సూచించారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో తెరాసకే పట్టం కట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.