ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు

భాజపా తన గ్రేటర్​ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గ్రేటర్​ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తామని.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా, జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు, మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, భూపేంద్ర యాదవ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

vఎల్​ఆర్​ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు
ఎల్​ఆర్​ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు
author img

By

Published : Nov 26, 2020, 2:30 PM IST

Updated : Nov 26, 2020, 3:06 PM IST

భాజపా మేనిఫెస్టో విడుదల

గ్రేటర్‌లో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని భాజపా తన జీహెచ్​ఎంసీ మేనిఫెస్టోలో ప్రకటించింది. వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని హమీ ఇచ్చింది. వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున ఇస్తామని వెల్లడించింది.

సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తామని.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షమంది పేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని పేర్కొంది.

అందరికీ వ్యాక్సిన్...

గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొంది. మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ ఏర్పాటు చేస్తామని భాజపా తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దుచేస్తామని తెలిపింది. ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ చేస్తామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఇస్తామని.. పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్​ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది.

లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరిస్తామంది.

28 వేల నియామాకాలు...

విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని భాజపా పేర్కొంది. నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తామంది. జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతామని భాజపా హామీ ఇచ్చింది.

నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేస్తామని తెలిపింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన నిర్మిస్తామని.. పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.

మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని భాజపా ప్రకటించింది. ప్రతి డివిజన్‌లో గ్రీవెన్స్ సెల్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్,4 శ్మశానవాటికలు ఏర్పాటు చేస్తామంది. హైదరాబాద్‌కు నలువైపులా డంపింగ్ యార్డులు నిర్మిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ రోడ్లపై గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు చేస్తామని స్పష్టంచేసింది.

పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ...

పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ, ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయిస్తామంది. పాత హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల ఆర్థికసాయం, ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఇవీచూడండి: ఉత్సవాలు చేయడం కాదు.. గౌరవం కాపాడాలి : బండి సంజయ్

Last Updated : Nov 26, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.