ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. 100 నంబర్‌కు డయల్ చేసిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం మొత్తం 16 డీఆర్ఎఫ్ ట్రక్కులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సహాయక చర్యలతో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. డీఆర్ఎఫ్ వాహనాల రాకతో విపత్తు నిర్వహణ విభాగం పటిష్ఠం అయిందంటున్న విశ్వజిత్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీచూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం