హైదరాబాద్ సైబర్ టవర్స్ సమీపంలోని అక్రమ నిర్మాణాలు, వెంచర్లను జీహెచ్ఎంసీ ప్రణాళికా విభాగం, రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా కూల్చివేసింది. చెరువును పూడ్చివేయడానికి వేసిన మట్టిని, నిర్మాణ వ్యర్థాలను జేసీబీల సాయంతో అధికారులు తొలగించారు. పూర్తి నిల్వ సామర్థ్యం మేరకు నీటిపారుదల సహకారంతో ఫెన్సింగ్, ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు నగర ప్రణాళికా విభాగం ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
సున్నం చెరువులో అక్రమ వెంచర్ల తొలగింపు - హైదరాబాద్ సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ సైబర్ టవర్స్ సమీపంలోని 32 ఎకరాల సున్నం చెరువు ఆక్రమణపై అధికారులు కొరడా ఝుళిపించారు. చెరువు ప్రాంతంలో నిర్మాణాలు, అక్రమ వెంచర్లను జీహెచ్ఎంసీ ప్రణాళికా విభాగం అధికారులు, రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా కూల్చివేశారు.
సున్నం చెరువులో అక్రమ వెంచర్ల తొలగింపు