గత ప్రభుత్వాల హయాంలో జీహెచ్‌ఎంసీపై సదాభిప్రాయం ఉండేది కాదని... తెరాస హయాంలో ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఏర్పాటై మూడేళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేస్తూ సంబురాలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ మార్గదర్శకత్వంలో రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)