అతివేగంగా వెళ్లే వాహనాలను స్పీడ్‌గన్‌తో ట్రాక్ చేసి జరిమానాను చలాన్ల రూపంలో పంపించే విధానం భాగ్యనగరంలో కొనసాగుతుంది. ఒక్కసారి స్పీడ్‌గన్‌కు చిక్కారంటే సాధారణ వ్యక్తి అయినా.. ప్రభుత్వ అధికారైనా చలానా చెల్లించక తప్పదు. కాని జీహెచ్ఎంసీ కమీషనర్ కారు ఇప్పటి వరకు ఆరుసార్లు అధిక వేగంతో వెళ్లినట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ చలానా చెల్లించలేదని ఓ పౌరుడు ట్విట్టర్‌ద్వారా పేర్కొన్నాడు. టీఎస్09 ఎఫ్ఏ 4248 జీహెచ్ఎంసీ కమిషనర్ కారు నంబర్‌పై రూ.6,210 చలాన్లు బాకీ ఉన్నట్లు తెలిపాడు. తేరుకున్న అధికారులు కారుపై ఉన్న చలానా మొత్తం చెల్లించారు. దీనికి కారణమైన కారు డ్రైవరును జీహెచ్ఎంసీ కమిషనర్ మందలించారు.
ఇదీ చూడండి: ఎన్నికల సమయంలోనే గుర్తుకోస్తామా?