వర్షం పడినప్పుడు ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్ ప్రయాణానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. వర్షాల వల్ల ఐటీ కారిడార్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్, మెట్రో, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాహనాల దారి మళ్లింపుతో పాటు.. నిర్దేశించిన సమయంలోనే వాహనాలు బయటకు వచ్చేలా తగిన చర్యలు తీసుకునేలా చర్చిస్తున్నారు.
- ఇదీ చూడండి : 0.03 టీఎంసీలకు చేరిన నిజాం సాగర్ నీటిమట్టం