భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. అధికారులు ప్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆఫ్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శిధిల భవనాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రానున్న 30 నిమిషాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్ మెంట్ ఈడీ విశ్వజిత్ పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయని నగర మేయర్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు రిలీఫ్ సెంటర్లకు తరలించాలని...ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మేయర్ సూచించారు.
ఇదీ చదవండి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కమిషనర్