నగరంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు నైట్ షెల్టర్లను ఏర్పాటును పూర్తిస్థాయిలో చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వాటిలో మౌలిక వసతుల కల్పించాలని అధికారులను కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 15 నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నామని.. వీటిలో దాదాపు 600 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారని లోకేశ్ కుమార్ పేర్కొన్నారు. నిరాశ్రయులకు రాత్రివేళలో ఆశ్రయం కల్పించడానికి అవసరమైతే జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాళ్లను వినియోగించుకోవాలన్నారు. ఇటీవల కాలంలో నగరంలోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకుల సంఖ్య అధికంగా ఉంటోందన్నారు. తగ్గించేందుకు పోలీసు శాఖ సహాయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ డ్రైవ్‌లో భాగంగా వ్యర్థాలను వేసేందుకు ప్రతి వార్డులో ఖాళీ స్థలాలను గుర్తించాలని అధికారులకు లోక్శ్కుమార్ సూచించారు.
ఇవీచూడండి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై