వర్షాల సమయంలో సత్వర మరమ్మతు సభ్యులు... విపత్తు బృందాలతో కలిసి పనిచేయాలని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వర్షాలతో నగరంలో కలుగుతున్న ఇబ్బందులపై అధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. నీటి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించిన కమిషనర్.... అర కిలోమీటర్ వరకు వ్యర్థాలు లేకుండా చూడాలని అన్నారు. వర్షం పడిన వెంటనే నీరు రోడ్లపై నిలవకుండా చేసే బాధ్యత స్థానిక అధికారులదేనని నిర్దేశించారు.
ఇదీ చూడండి : 'మెట్రో రైలు' తరుచుగా ఆగును..!