సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పాల్గొన్నారు. వారసత్వ సంపదను రక్షించడం మన బాధ్యత అని దాన కిశోర్ తెలిపారు. వారసత్వ సంపదను రక్షించడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక విధుల్లో ఒక్కటని సూచించారు. తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి :కాగితాలతో కళాఖండాలు