హైదరాబాద్ చందానగర్ పరిధిలోని స్టాలిన్నగర్, ప్రశాంత్‌నగర్, ఎంఏ నగర్లలో వాటర్ వర్క్స్ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పర్యటించారు. నీటి వృథా అవగాహన, సాఫ్ హైదరాబాద్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి నీటి వృథాను అరికట్టడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం
భాగ్యనగరంలో నీటి వృథాను అరికట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై నీరు ఎక్కువగా వృథా చేసే ఇంటికి నల్లా కనెక్షన్ తొలగించాలని నిర్ణయించారు. నీటి వాడకంపై ప్రతి ఇంటికి రంగులతో గుర్తులను వేయనున్నారు. ఎక్కువగా నీరు వృథా చేసే ఇళ్లకు ఎరుపురంగు, నీరు పొదుపు చేస్తూ... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు నీలం రంగు, ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు ఆకుపచ్చ రంగును గుర్తులుగా వేయనున్నారు.
ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'