ETV Bharat / state

భాగ్యనగరంలో స్వయం సహాయక బృందాలకు 25లక్షల రుణం..! - సమీక్ష సమావేశం

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పనితీరుపై కమిషనర్ దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్​ఎంసీకి సంబంధించి నూతన ఎస్​హెచ్​జీ​లు, సీఆర్పీల నియామకం, బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కీలక నిర్ణయాలను కమిషనర్ వెల్లడించారు.

ఎస్​హెచ్​జీ​లు, సీఆర్పీల నియామకం, బస్తీ దవాఖానాల ఏర్పాటుకు దాన కిషోర్ కీలక నిర్ణయాలు
author img

By

Published : Jul 31, 2019, 8:13 AM IST

Updated : Jul 31, 2019, 9:03 AM IST

జీహెచ్ఎంసీ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ దానకిశోర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానగరపాలక సంస్థలో ఏటా వాహ‌నాల అద్దె పేరిట దాదాపు వందల కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ్యయం చేస్తోంది. ఈ వాహ‌నాలను స్వయం స‌హాయ‌క బృందాల ద్వారా కొనుగోలు చేయించి వాటిని జీహెచ్ఎంసీకే అద్దెకు ఇవ్వనున్నారు.

ఎస్​హెచ్​జీ​లు, సీఆర్పీల నియామకం, బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కీలక నిర్ణయాలు
రూ. 25ల‌క్షల వరకు బ్యాంకు రుణంహైద‌రాబాద్​లో ప్రస్తుతం రూ.45వేల స్వయం స‌హాయ‌క బృందాల్లో నాలుగున్నర ల‌క్షల మంది మ‌హిళా స‌భ్యులు ఉన్నారు. ఈ బృందాల్లో 10 నుంచి 15 ఏళ్ల సీనియార్టీ క‌లిగి క్రమం త‌ప్పకుండా రుణాల‌ను చెల్లించే క‌నీసం 100 బృందాల‌ను గుర్తించారు. ఒక్కో బృందానికి రూ.25ల‌క్షల వ‌ర‌కు బ్యాంకుల నుంచి రుణాలు అంద‌జేసేందుకు నిర్ణయించామ‌ని దాన‌కిశోర్ వివ‌రించారు.ఇప్పటికే ఒక్కో బృందానికి రూ. 10-15 ల‌క్షల వ‌ర‌కు బ్యాంకు రుణాలు అందుతున్నాయ‌ని స్పష్టం చేశారు. వీటిని రూ.25ల‌క్షల‌కు పెంచి అందించ‌నున్నట్లు వివరించారు. ఈ నిధులతో ఆయా బృందాల‌తో ట్రక్‌లు, మినీ లారీలు కొనుగోలు చేయించి వాటిని జీహెచ్ఎంసీకి అద్దె ప్రాతిప‌దిక‌పై ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఎస్​హెచ్​జీ మ‌హిళ‌లు ఆర్థిక‌ంగా బ‌లోపేతం కానున్నారు. స్వయం స‌హాయ‌క బృందాలను ప‌టిష్ఠం చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా బ‌లోపేతం చేయ‌డానికి కొత్తగా 3వేల మంది సీఆర్పీలను నియ‌మించ‌నున్న‌ట్లు ప్రక‌టించారు. కొత్తగా నెల‌కు ఆరువేల రూపాయ‌ల పారితోషికంతో వీరిని నియ‌మించ‌నున్నామని తెలిపారు.మరో రెండొందల బస్తీ దవఖానాలు ఏర్పాటుపేద‌వారి వైద్యం కోసం ఇప్పటి వ‌ర‌కు ఏర్పాటు చేసిన 105కు పైగా బ‌స్తీ దవ‌ఖానాలు విజ‌య‌వంతమ‌య్యాయ‌ని తెలిపారు. గ్రేట‌ర్‌లో మ‌రో 200 బ‌స్తీ దవ‌ఖానాల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక స‌దుపాయాలు, ప్రాంతాలను మూడు నెల‌ల్లోగా ఎంపిక చేస్తామన్నారు.మ‌రో 2వేల కొత్త గ్రూపుల ఏర్పాటుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 2వేల స్వయం స‌హాయ‌క మ‌హిళా బృందాల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్ ఆదేశించారు. ప్రస్తుతం 45వేల గ్రూపులు ఉన్నప్పటికీ వీటిలో దాదాపు 7వేల గ్రూపులు స‌క్రమంగా ప‌నిచేయ‌ట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే 2వేల గ్రూపుల్లో క‌నీసం 500 గ్రూపులు అత్యంత నిరుపేద మ‌హిళ‌లే స‌భ్యులుగా ఉండేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

ఇవీ చూడండి : వేతన కోడ్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_73_30_HARISH_BC HASTTAL_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: మీతో ఆత్మీయాతను పంచుకొని.కల్సి అన్నం తిందాం అని వచ్చా.స్వేటర్లు నేను ఇస్తా. హీట్ వాటర్ ఎంపీ ఇస్తారు.పెండింగ్ లో కాస్మొటిక్ చార్జీలు.దుస్తులు వచ్చేలా చేస్తా.మీరు బాగా చదవండి.మీ అమ్మ నాన్నలకు నమ్మకాన్ని నిలబెట్టండి. సిద్దిపేట బీసీ బాలికల వసతి గృహ ఆకస్మికంగా తనిఖీ చేసి.విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించి..వారి బాగోగులు తెలుసుకున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు. వాయిస్ ఓవర్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా వసతి గృహం లో భోజనం ఎలా ఉన్నాయో పరిశీలించారు. హాస్టల్ లో విద్యార్థులకు సరి అయిన వసతులు ఉన్నాయో, భోజనము ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెల్సులున్నారు.. మెనూ ప్రకారం సమయానికి గుడ్లు,పండ్లు, చికెన్ , పౌష్టికాహారం, స్నాక్స్ అందిస్తున్నారా అని విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా మీకు ఏమైనా కావాలా అని ఆత్మీయంగా అడిగారు సార్.. వర్షాకాలం లో చల్లని నీరు తో స్నానం చేయాలి ఇబ్బంది గా ఉందని అనడం తో.. వేడి నీటి కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హీటర్ ఏర్పాటు చేస్తాన్నారు...మాకు చలిగా ఉంది సర్ స్వేటర్ కావాలి అని అడగ గానే నేను మీ అందరికి స్వేటర్ ఇప్పిస్తా అని ఆత్మీయంగా చెప్పారు... నేను స్వెటర్ ఇప్పిస్థా.. ఎంపీ హిట్ వాటర్ ఇప్పిస్తారు..అని వారితో చెప్పారు.అదేవిధంగా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Last Updated : Jul 31, 2019, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.