జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నవంబర్ 1 కరోనా పాజిటీవ్ వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కేటగిరి ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో www.tsec.gov.in లో లేదా సంబంధిత ఆర్వోకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న ఓటర్ల చిరునామాలకు సంబంధిత ఆర్వోలు పోస్టల్ బ్యాలెట్ ను పంపిస్తారని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ వివరించారు.
ఇవీ చదవండి: 'ప్రభుత్వానికి చెందవు.. ఎవరైనా ప్రకటనలు పెట్టుకోవచ్చు'