జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. గూగుల్ మీట్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు.
పని దినాల్లో రోజూ సాయంత్రం 4 నుంచి 5 వరకు ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సులో ప్రజలతో మాట్లాడనున్నట్లు లోకేశ్‌కుమార్ ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఇంటి వద్ద నుంచే సమస్యలను అధికారుల దృష్టికి తేవచ్చని సూచించారు. పౌరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.