MLA Raja Singh demands CBI enquriy: గతంలో సరైన అర్హత పత్రాలు లేకుండా జారీచేసిన 31 వేల జనన, మరణ ధ్రువపత్రాలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బ్లాక్ చేసింది. రద్దు చేసిన వాటిలో 27,328 జనన పత్రాలు, 4126 మరణ ధ్రువపత్రాలు ఉన్నాయి. గతంలో నాన్ అవేలబులిటిలో తెల్ల కాగితాలు అప్లోడ్ చేసిన వారికి జనన, మరణ ధ్రువపత్రాలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీచేసింది. సోమవారం వెలుగుచూసిన ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని కమినషర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ సెలవు కావడంతో.. రేపటి నుంచి జీహెచ్ఎంసీ ఏవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి విచారణ చేపట్టనున్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు 27 వేల బర్త్ సర్టిఫికెట్స్ తొలగించారని ఇందులో ఎక్కువ భాగం పాతబస్తీకి చెందినవేనని తెలిపారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వెనుక MIMపార్టీ హస్తం ఉందని, ధ్రువపత్రాలను చట్టవిరుద్ధంగా తయారుచేయించారని రాజాసింగ్ ఆరోపించారు.
మున్సిపల్ అధికారుల స్టాంప్, సంతకం లేకుండా ఒక్క ధ్రువపత్రం కూడా తయారు చేయడం సాధ్యంకాదని ఆయన తెలిపారు. లంచం ఇచ్చేవరకు అధికారులు ధ్రువపత్రాలను జారీ చేయడం లేదన్నారు. నకిలీ సర్టిఫికెట్లలో ఎంతమంది బంగ్లా, పాకిస్తాన్ దేశస్తులున్నారని ప్రశ్నించారు. దీని ద్వారా హైదరాబాద్ నగరం తీవ్రవాదులకు అడ్డగా మారుతోందని విమర్శించారు. వీరిలో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారనే విషయంలో సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
"నిన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 27 వేల జనన ధ్రువ పత్రాలను తొలగించింది. తెల్ల కాగితాలు పెట్టిన వారికి జనన, మరణ ధ్రువపత్రాలను జారీ చేశామని.. వాటిని రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం పాతబస్తీకే చెందినవి ఉన్నాయి. ఈ నకిలీ సర్టిఫికెట్ల వెనుక MIM పార్టీ హస్తం ఉంది. ధ్రువపత్రాలను చట్టవిరుద్ధంగా తయారు చేయించారు. మున్సిపల్ అధికారుల స్టాంప్, సంతకం లేకుండా ఒక్క ధ్రువపత్రం కూడా తయారు చేయడం సాధ్యం కాదు. లంచం ఇచ్చేవరకు అధికారులు ధ్రువపత్రాలను జారీ చేయడం లేదు. ఈ నకిలీ సర్టిఫికేట్లలో ఎంతమంది బంగ్లా, పాకిస్తాన్ దేశస్తులున్నారు. దీని ద్వారా హైదరాబాద్ నగరం తీవ్రవాదులకు అడ్డాగా మారుతోంది. వీరిలో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారనే విషయంలో సీబీఐ విచారణ చేయాలి". -రాజాసింగ్, గోషామహాల్ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: