ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ సహాయ ఇంజినీర్లకు కొవిడ్‌ కష్టాలు

కరోనా కేసులు నగరంలో మొదలైనప్పటి నుంచి.. కట్టడి చర్యల్లో ముందుండి పనిచేసిన యువ ఇంజినీర్లకు సెలవులు కరవయ్యాయి. కంటైన్మెంట్‌ జోన్లలో, క్లస్టర్లలో విధులు నిర్వర్తించడం వల్ల ఇప్పటి వరకు సుమారు 35 మంది ఏఈలు కొవిడ్‌ బారినపడ్డారు. పలువురి కుటుంబసభ్యులకూ వైరస్‌ సోకింది. ఈ క్రమంలో చికిత్సకు పూర్తిస్థాయిలో సెలవు తీసుకోలేక ఇంజినీర్లు ఇబ్బంది పడుతున్నారు. కొందరు వారం, రెండు వారాలకే విధుల్లో చేరుతుండటం ఆందోళనకు తావిస్తోంది.

ghmc assistant engineers effected by corona
జీహెచ్‌ఎంసీ సహాయ ఇంజినీర్లకు కొవిడ్‌ కష్టాలు
author img

By

Published : Aug 6, 2020, 10:09 AM IST

నగరంలో కరోనా కేసులు పెరుగుతుడం వల్ల అనుమానిత వ్యాధి లక్షణాలున్న వ్యక్తులను ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లి ధైర్యంగా పరీక్షలు చేయించిన అధికారులకు కష్టాలు ఎదురవుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో ఐదేళ్లుగా శిక్షణ కాలంలో కొనసాగుతూ పరిమిత సెలవులతో విధులు నిర్వర్తిస్తున్న ఏఈల దుస్థితి ఇది.

మొదటి నియామకం మాదే.. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు సాధించిన మొదటి జట్టు మాది. రెండేళ్లు శిక్షణ(ప్రొబెషన్‌) పూర్తి చేసుకుంటే.. మా కొలువుల క్రమబద్ధీకరణ జరగాలి. ఐదేళ్లయినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. దాంతో ఏడాది మొత్తానికి నెల రోజుల సెలవులు ఉంటున్నాయి. మాకు కరోనా వైరస్‌ సోకినప్పుడు, కరోనా కాలానికి ముందు వచ్చిన అవసరాలకు వాటిని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వైరస్‌ బారినపడుతున్నారు. వృద్ధాప్యంలోని వారికి సాయం చేయలేని పరిస్థితి నెలకొంది.’’అని ఐటీ ఉద్యోగం వదులుకుని బల్దియాలో ఏఈగా పనిచేస్తోన్న అధికారి ‘ఈనాడు’తో వాపోయారు. మహిళా ఇంజినీర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.

ధైర్యంగా పనిచేశాం..

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో ధైర్యంగా పనిచేశాం. తబ్లిగీ జమాత్‌ కేసులను, విదేశాల నుంచి నగరానికొచ్చినోళ్లను గుర్తించడంలో మాది ముందు వరుస. అనుమానితుల ఇంటికెళ్లి హోమ్‌ క్వారంటైన్‌ ముద్రలు వేశాం. వ్యాధి లక్షణాలున్నవారిని అంబులెన్సుల్లో ఎక్కించి పరీక్షలకు తరలించడం, అంబులెన్సు ఆలస్యంగా వచ్చినప్పుడు ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కట్టడి ప్రాంతాల్లో ప్రజలు బయటకు తిరగకుండా నోడల్‌ అధికారులుగా పనిచేశాం. ఈ క్రమంలో మాకు వైరస్‌ సోకింది.’’అని యువ ఇంజినీర్లు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.

ఇదీ చూడండి : పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.