ETV Bharat / state

'ముంబయిలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోండి' - ముంబయిలో చిక్కుకున్న తెలుగువారు

ముంబైలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని మహారాష్ట్ర సీఎంకు జనసేన అధినేత పవన్ విజ్ఞప్తి చేశారు. వారి ఇబ్బందులు తెలిపేలా ట్విట్టర్​లో వీడియోను పోస్ట్ చేసిన పవన్...వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

pavan
pavan
author img

By

Published : Mar 31, 2020, 8:53 PM IST

ఉపాధి కోసం వెళ్లి ముంబయి శివారు గోమహల్లిలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా వాసులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు చెందిన 500 కుటుంబాలు ముంబై శివార్లలో చిక్కుకుపోయిన విషయాన్ని లేఖ, ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు. వారంతా ఆహారం, మంచినీళ్లు, కనీస సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుతో చర్చలు జరపాలని కోరారు.

కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముంబైలో చిక్కుకుపోయిన వారి ఇబ్బందులు తెలిపేలా వీడియోలను పవన్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

'ముంబయిలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోండి'

ఇదీచదవండి: 20 వేల బోగీల్లో 3.2 లక్షల కరోనా పడకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.