German Passport Issue Of Former BRS MLA Chennamaneni Ramesh In High Court : బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు జర్మన్ పాస్‌పోర్టు ఉందని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు నివేదించింది. పాస్ పోర్టును 2033 వరకు పునరుద్దరించుకున్నారని గత ఏడాది ఈ పాస్‌పోర్టుతో జర్మన్ మూడు సార్లు వెళ్లి వచ్చారని తెలిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. చెన్నమనేని ప్రయాణ వివరాలు అందించాలన్న ఆదేశాల మేరకు కేంద్రం రికార్డును అందజేసింది. మరోవైపు చెన్నమనేని జర్మన్ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు మెమో దాఖలు చేశారు.
పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్
BRS MLA Chennamaneni Ramesh : జర్మన్ పాస్‌పోర్టు మీద ప్రయాణించినంత మాత్రాన పౌరసత్వం ఉన్నట్టు కాదని జర్మన్ ఎంబసి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పౌరసత్వ చట్టం ప్రకారం విచారించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా కేంద్రం వ్యవహరించిదన్నారు. అప్పట్లో ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తు ఆ దేశ పౌరుడు కాకుండా పాస్‌పోర్టు పొందలేరన్నారు. ఇప్పటికీ రెండు దేశాల పాస్ పోర్టులు ఉన్నాయని కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.
జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్: కేంద్రానికి హైకోర్టు గడువు
Chennamaneni German Passport Issue : తన జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్(Chennamaneni Ramesh) హైకోర్టుకు వెల్లడించారు. పౌరసత్వ వివాదంపై వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తన జర్మనీ పౌరసత్వం వెనక్కిచ్చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది హైకోర్టు. మరోసారి ఎవరూ గడువు కోరవద్దనీ, తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు స్పస్టం చేసింది.
Chennamaneni case: పత్రాలన్నీ పుస్తకరూపంలో సమర్పించండి: హైకోర్టు
High Court : ఆ తర్వాత విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం(భారత్ తోపాటు జర్మనీ) కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
చెన్నమనేని పౌరసత్వం రద్దు ఉత్తర్వులపై స్టే పొడిగింపు
Chennamaneni Issue: పౌరసత్వ వివాదంపై విచారణ ఈ నెల 15కి వాయిదా