ETV Bharat / state

కొత్త వైరస్సా.. పాత వైరస్సా..? తెలియాలంటే అది తప్పనిసరి

కరోనా వైరస్‌ రూపు మార్చుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్​ పాజిటివ్‌ నమూనాల జన్యుక్రమాల విశ్లేషణకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ కేసుల్లోంచి ఐదు శాతం జన్యు పరిశోధన ప్రయోగశాలలకు పంపాల్సి ఉంది.

కొత్త వైరస్సా.. పాత వైరస్సా తెలియాలంటే అది తప్పనిసరి

author img

By

Published : Jan 4, 2021, 6:55 AM IST

కొవిడ్‌ కొత్త వైరస్‌ వ్యాప్తి పరిధిని అంచనా వేయడం.. స్వతంత్రంగా ఉద్భవించే ఇతర వైరస్‌ల వ్యాప్తిపై నిఘా... ఉత్పరివర్తనాల్ని ఎప్పటికప్పుడు గుర్తించడం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడూ కీలకంగా మారడం వల్ల కరోనా పాజిటివ్‌ నమూనాల జన్యుక్రమాల విశ్లేషణకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం వస్తున్న పాజిటివ్‌ కేసుల్లోంచి ఐదు శాతం జన్యు పరిశోధన ప్రయోగశాలలకు పంపాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)లో నెలకు 5వేల కరోనా వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొనే సామర్థ్యం ఉంది. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌(సీడీఎఫ్‌డీ)లో నెలకు 1200 సామర్థ్యం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. సీసీఎంబీ, సీడీఎఫ్‌డీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవా, కర్ణాటకల నమూనాల కోసం ఎంపిక చేశారు. తెలంగాణలో ప్రస్తుతం సగటున 300 పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. వీటిలో ఐదు శాతం అంటే 15 నమూనాల్ని జన్యుక్రమం కనుగొనేందుకు పంపించాల్సి ఉంది.

జన్యుక్రమం కనుగొనే వైరస్‌ల నమూనాల ఎంపికకు కేంద్ర మార్గదర్శకాలు మరికొన్ని..

* విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ నమూనాలు

* రెండోసారి కరోనా బారిన పడిన వ్యక్తుల నమూనాలు

* టీకా వేయించుకున్నవారు, టీకా ప్రయోగాల్లో పాల్గొన్నవారు కరోనా బారిన పడినట్లయితే..

* మొత్తం కేసుల్లో ర్యాండమ్‌గా ఐదు శాతం పాజిటివ్‌ నమూనాలను..

ఇప్పటివరకు దేశంలో..

జన్యుక్రమాల వివరాలు
జన్యుక్రమాల వివరాలు

కరోనా వైరస్‌ రూపు మార్చుకుంటోంది. ఎప్పటికప్పుడు మారుతున్న తీరు అర్థం చేసుకోవడంతో పాటు ముప్పును ముందే పసిగట్టాలంటే సోకిన వారి నుంచి సేకరించిన వైరస్‌ నమూనాల్లో ఎక్కువవాటి జన్యుక్రమాన్ని కనుగొనాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. దేశంలో ఇప్పటివరకు అతి తక్కువగా వైరస్‌ జన్యుక్రమాలను కొనుగొన్నారు. పాజిటివ్‌ కేసులు కోటి దాటగా వీటిలో జన్యుక్రమాలను కనుగొన్నది 4,236 మాత్రమే. అందులో తెలంగాణ నుంచి.. 672 ఉన్నాయి.

ఇదీ చూడండి: కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్‌ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.