ETV Bharat / state

కానిస్టేబుల్ ఔదార్యం.. కరోనా బాధితుడికి ప్లాస్మా దానం

సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేసే శ్రీకాంత్ ప్లాస్మా దాతగా మారాడు. కరోనా మహమ్మారి బారిన పడి మాదాపూర్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ప్లాస్మా దానం చేసి ఆదర్శప్రాయుడయ్యాడు.

author img

By

Published : Jul 31, 2020, 3:43 PM IST

కానిస్టేబుల్ ఔదార్యం.. కరోనా బాధితుడికి ప్లాస్మా దానం
కానిస్టేబుల్ ఔదార్యం.. కరోనా బాధితుడికి ప్లాస్మా దానం

కరోనా బారిన పడిన కానిస్టేబుల్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. వైద్య చికిత్స అత్యవసరం ఉన్న ఓ రోగికి సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్​కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ప్లాస్మా దానం చేసి ప్రాణ దాతగా నిలిచాడు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి మాదాపూర్​లోని ఓ ఆస్పత్రిలో 'ఓ నెగటివ్' రక్తం గల ప్లాస్మాను దానం చేశాడు. ప్లాస్మా దానం విషయం తెలుసుకున్న నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్​ సహా పలువురు అభినందించారు.

కొన్ని రోజుల క్రితం తానూ...

గత కొన్ని రోజుల క్రితం కార్ఖానా ఠాణాకు చెందిన శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉండటం వల్ల ఆయన త్వరగానే కోలుకున్నారు. అత్యవసర స్థితిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ప్లాస్మా అవసరం ఉందని శ్రీకాంత్​కు సమాచారం తెలియగానే ప్లాస్మా దాన ఆవశ్యకతను గుర్తించారు. ఫలితంగా సదరు కానిస్టేబుల్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ప్లాస్మా దానం చేశారు.

సంతృప్తి మిగిలింది...

ప్లాస్మా దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా బాధితుడ్ని కాపాడిన సంతృప్తి తనకు మిగిలిందని శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఆదర్శంగా నిలవాలి..

వైరస్ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులను ఆదుకోవాలని.. సమాజానికి ఆదర్శంగా నిలవాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు.

ఇవీ చూడండి : ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిఘా పెట్టాలి: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.