ETV Bharat / state

Coal shortage: అలా చేస్తే ఆర్థిక సంక్షోభం తప్పదు: జెన్​కో - coal shortage in india latest news

coal shortage in india: ప్రతి రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు ఏడాదిలో వినియోగించే బొగ్గు పరిమాణంలో 10% విదేశాల నుంచి కొనాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో కొరత తీర్చేందుకేనని వెల్లడించింది. కొంటే ఆర్థిక సంక్షోభం తప్పదని జెన్‌కోలు అభిప్రాయపడుతున్నాయి.

coal shortage in telangana
coal shortage in telangana
author img

By

Published : Apr 30, 2022, 7:45 AM IST

coal shortage in india: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొత్త వివాదాలను రాజేస్తోంది. ప్రతి రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు(జెన్‌కో), ప్రైవేటు విద్యుత్కేంద్రాలు ఏడాదిలో వినియోగించే బొగ్గు పరిమాణంలో 10 శాతాన్ని తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడమే దానికి కారణం. దేశంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా తక్కువగా ఉన్నందున ఈ ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది.

‘‘దేశవ్యాప్తంగా ఉన్న 165 థర్మల్‌ కేంద్రాల్లో సాధారణంగా 66.53 లక్షల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. వాటన్నింటిలో రోజువారీ విద్యుదుత్పత్తికి 27.48 లక్షల టన్నుల బొగ్గును వినియోగిస్తారు. వాస్తవంగా అన్ని కేంద్రాల్లో కలిపి ఈ నెల 27 నాటికి 21.02 లక్షల టన్నులే ఉంది. 108 కేంద్రాల్లో సాధారణ అవసరాలకన్నా 25 శాతానికన్నా తక్కువే ఉంది. వాటిలో ఎనిమిది కేంద్రాల్లో బొగ్గు లేక విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 12 కేంద్రాలు పూర్తిగా విదేశీ బొగ్గుపైనే ఆధారపడి నడుస్తున్నందున, విద్యుదుత్పత్తి తగ్గిపోయి పలు రాష్ట్రాల్లో కరెంటు కోతలు విధిస్తున్నారు. తెలంగాణలో కాకతీయ థర్మల్‌ కేంద్రంలోనూ చాలా తక్కువగా ఉంది. రైళ్ల కొరత వల్ల ఏపీలో కేంద్రాలకు సరఫరా తగ్గి కొరత నానాటికీ పెరుగుతోంది’’ అని కేంద్ర విద్యుత్‌ మండలి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులని కేంద్ర విద్యుత్తుశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సింగరేణి గనుల నుంచి టన్ను బొగ్గును తాము రూ.4-5 వేలకు కొంటున్నామని తెలంగాణ జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు అంతకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించడం ఎలా సాధ్యమని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అలాచేస్తే థర్మల్‌ కేంద్రాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడం ఖాయమంటున్నాయి. ‘‘దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే తెలంగాణ వంటి రాష్ట్రాలకు విదేశీ బొగ్గు అవసరమే ఉండదు. స్థానికంగా బొగ్గు గనులున్న తెలంగాణ వంటి రాష్ట్రాల జెన్‌కోలను కూడా విదేశాల నుంచి తప్పనిసరిగా కొనాలని ఆదేశించడం ఏమాత్రం సరికాద’ని తెలంగాణ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’తో అభిప్రాయపడ్డారు.

ఉత్పత్తి వ్యయం ఆకాశానికే.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరెంటు యూనిట్‌ సగటు సరఫరా వ్యయం రూ.7.14కి చేరింది. విదేశీ బొగ్గు తెప్పిస్తే అది కాస్తా రూ.9 నుంచి 10కి చేరుతుందని విద్యుత్‌ వర్గాల అంచనా. ఉదాహరణకు తమ రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాలకు ఐదు లక్షల టన్నుల విదేశీ బొగ్గు అవసరమంటూ ఏపీ జెన్‌కో గతంలో టెండరు పిలిచింది. టన్నుకు రూ.40 వేల చొప్పున చెల్లించాలని అదానీ గ్రూప్‌ సంస్థ టెండరు వేసింది.

దేశీయంగా సింగరేణి సహా ఇతర గనుల నుంచి టన్ను సగటున రూ.3,600కే కొనుగోలుచేస్తుండటం, అంతకు 10 రెట్లు అధికంగా చెల్లించాల్సి రావడంతో ఏపీ జెన్‌కో ఆ టెండర్లను రద్దుచేసింది. తెలంగాణ థర్మల్‌ కేంద్రాలకు రోజూ 50 వేల టన్నుల బొగ్గు వినియోగిస్తున్నారు. ఏపీ అనుభవం దృష్ట్యా అందులో 10 శాతం అంటే ఐదు వేల టన్నుల విదేశీ బొగ్గు ఆ ధరకు కొనాలంటే భారీగా ఆర్థిక భారం పడుతుందని భావించిన తెలంగాణ జెన్‌కో కేంద్రం ఆదేశాలపై మల్లగుల్లాలు పడుతోంది.

కొంటే మునిగిపోవడం ఖాయం: 'థర్మల్‌ కేంద్రాలకు 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని కేంద్రం ఆదేశాలిచ్చిన మాట వాస్తవం. ఇప్పటికే దేశీయ బొగ్గు ధరలు, గూడ్సు రైళ్ల రవాణా ఛార్జీలు పెంచడం వల్ల తెలంగాణ జెన్‌కోపై గతేడాది రూ.400 కోట్ల అదనపు భారం పడింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతమున్న ధరలకు విదేశీ బొగ్గు కొంటే ఉత్పత్తి వ్యయం పెరిగి విద్యుదుత్పత్తి సంస్థలు సంక్షోభంలో కూరుకుపోతాయి. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.' - ప్రభాకరరావు, సీఎండీ, తెలంగాణ జెన్‌కో

ప్రభాకరరావు, సీఎండీ, తెలంగాణ జెన్‌కో

బొగ్గు సరఫరా కోసం 42 రైళ్ల రద్దు: దేశవ్యాప్తంగా విద్యుత్‌ థర్మల్‌ కేంద్రాలకు వేగంగా బొగ్గు సరఫరా చేసేందుకు వీలుగా 42 ప్యాసింజర్‌ రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. థర్మల్‌ కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు వేగంగా తరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.