ETV Bharat / state

పాల డెయిరీలో గ్యాస్ లీక్... 14 మందికి అస్వస్థత

author img

By

Published : Aug 21, 2020, 11:12 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా హట్సన్ పాల డెయిరీలో గ్యాస్ లీకైన ఘటనలో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమలో కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అమ్మోనియం లీక్ అవ్వటంతో... అక్కడ ఉన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా మహిళలే కాగా... వారిని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

gas-leakage-in-hatsun-milk-dairy-in-chittoor-district
పాల డెయిరీలో గ్యాస్ లీక్... 14 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లిలో ఉన్న హట్సన్ పాల డెయిరీలో... గురువారం రాత్రి గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. ప్రొడక్షన్ యూనిట్​లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా మహిళలే. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ పరామర్శించారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. తిరుపతికి తరలించాల్సిందిగా కలెక్టర్ సూచించారు.

అప్పుడే చెప్పగలం..

అంతకుముందు ఎం.బండపల్లిలోని హట్సాన్ పాల డైయిరీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ... సంఘటన జరిగిన తీరును పరిశ్రమ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాల డైయిరీలో... కూలింగ్ ప్రక్రియలో భాగంగా ఓ పైప్ వెల్డింగ్ చేస్తుండగా అమ్మోనియం లీక్ అయినట్లు పరిశ్రమ సిబ్బంది కలెక్టర్​కు వివరించారు. సంఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్... జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అగ్నిమాపక శాఖ సంయుక్తంగా విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక అందిన తర్వాతే... ఇది ప్రమాదమా? పరిశ్రమ నిర్లక్ష్యమా? చెప్పగలుగుతామని కలెక్టర్ తెలిపారు.

గ్యాస్ లీకేజ్ వల్ల.. పరిసర గ్రామాలకు ఎలాంటి ముప్పు ఉండదని.. కలెక్టర్ వివరించారు. భయాందోళనకు లోనుకాకుండా.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పేదరిక సూచీని ఖరారు చేయనున్న నీతి ఆయోగ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.