Ganja Addiction Increased in Telangana : గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల మంది గంజాయి వ్యసనానికి బానిసలయ్యారని కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడయింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది దీని బారిన పడగా, 17 సంవత్సరాల లోపు మైనర్లలోనూ వీటి ఛాయలు (Minors Addicted Ganja in Telangana) కనిపిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
2 Lakh People Addicted to Ganja in Telangana : దేశవ్యాప్తంగా 18, 75 ఏళ్ల లోపు వారిలో 15.01 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. కొకైన్ బారిన పడిన వారు 9.4 లక్షలు, అంపెటమైన వంటి నిషేదిత మత్తు పదార్ధాల తీసుకునేవారు 15.47 లక్షలు ఉన్నారు. గంజాయి వ్యసనపరులు 2.9 కోట్లు, నల్లమందు తీసుకునే వారు 1.86 కోట్లు, మత్తు మందు పీల్చే వారు 51.25 లక్షలు ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా గంజాయి వ్యసనపరులు ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది ఉన్నట్టు వెల్లడయింది.
బోల్తా కొట్టిన కారు - బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి, ఎక్కడంటే?
Youth Addicted Ganja in Telangana : తెలంగాణలో గంజాయి వ్యసనపరులు 18 లోపువారు 10 వేల మంది కాగా, 18 నుంచి 75 సంవత్సరాలు వయసువారు 1.90లక్షల మంది ఉన్నారు. నిద్రమాత్రలు తీసుకుంటున్నవారు 18 ఏళ్ల లోపువారు 36 వేలు, 18 నుంచి 75 సంవత్సరాల వయసు కలిగినవారు 16.63 లక్షల మంది ఉన్నారు. ఓపియం తీసుకుంటున్న 18 సంవత్సరాల లోపువారు 98 వేలు, 18 నుంచి 75 ఏళ్ల లోపువారు 5.47 లక్షల మంది ఉన్నారు. కొకైన్ తీసుకుంటున్నవారు 18 సంవత్సరాల లోపువారు 2900, 18 నుంచి 75 ఏళ్ల లోపు వారు 22 వేల మంది ఉన్నారు.
సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత
Ganja Use Rises In Across Telangana : ఆల్కహాల్ తీసుకుంటున్నవారు 18 నుంచి 75 సంవత్సరాల వారు 50.40 లక్షల మంది ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా యువతలో మాదకద్రవ్యాల (Youth Use Ganja) వినియోగం అధికమవుతుండడంతో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు, పోలీసు అధికారులు సూచిస్తున్నారు. యువత ఉపయోగించే సామాజిక మాధ్యమాలపై ఓ కన్నేసి ఉంచాలని పేర్కొంటున్నారు. మత్తు పదార్ధాల కట్టడిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడం వలన మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల ఉపయోగం తగ్గే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
రూ.1.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఎక్కడంటే?
గంజాయి రవాణా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఉత్తర్‌ప్రదేశ్ వయా హైదరాబాద్ - అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్