గంగపుత్ర మహిళల్ని నిరంతరం చైతన్య పరుస్తూ.. కుల హక్కుల సాధనకు కృషి చేస్తున్న మహిళా సభ అధ్యక్షురాలు అరుణజ్యోతి బెస్త బీసీ ఫెడరేషన్ అవార్డు గెలుచుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ సునీత, ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు మనిమంజరి సాగర్లు.. అరుణను సన్మానించారు. బధిరులకు, అనాధలకు సాయం చేస్తున్న అరుణను సన్మానించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సునీత తెలిపారు.
గంగపుత్ర మహిళలకు అంకితం..
ఈ అవార్డును గంగపుత్ర మహిళలకు అంకితం ఇస్తున్నట్లు అరుణజ్యోతి వెల్లడించారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించనున్నట్లు అరుణ స్పష్టం చేశారు. జీఓ నెంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మత్స్య సొసైటీలకే ఇవ్వాలి..
హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో ఇవ్వనున్న ఫిష్ మొబైల్ వాహనాలు కేవలం మత్స్య సొసైటీలకే ఇవ్వాలని అరుణ జ్యోతి బెస్త డిమాండ్ చేశారు. బెస్తలకే తొలి హక్కు అని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కేవలం ఓటు బ్యాంక్ గా ఉన్న బీసీ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని ఓబీసీ జాతీయ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తెలిపారు.
ఆ మహిళలు అభినందనీయులు..
మహిళా సభ కార్యదర్శి అనిత బెస్త కుల సేవలను గుర్తించిన బీసీ ఫెడరేషన్ నేతలు ఆమెను ఘనంగా సత్కరించారు. మత్స్యకార కులం గంగపుత్ర నుంచి మహిళలు ముందురావడం అభినందనీయమని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
చైతన్యం తెచ్చేందుకే..
రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుతున్న నేపథ్యంలో బీసీ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని ఓబీసీ జాతీయ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తెలిపారు.
కార్యక్రమంలో 11 బీసీ ఫెడరేషన్ల నేతలు, సమితి నాయకురాలు దశరథ లక్ష్మి , గంగపుత్ర మహిళా సభ ప్రతినిధులు భాగ్య బెస్త , రాజ్యలక్ష్మి బెస్త వివిధ బీసీ కుల సంఘాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : జీహెచ్ఎంసీ ముసాయిదా పద్దు@ రూ.5,600 కోట్లు