అసెంబ్లీ ముట్టడికి గంగపుత్ర సంఘం యత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవో నంబరు 6ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గంగపుత్రులు నిరసనకు దిగారు. చెరువులు, కుంటల్లో చేపలు పట్టే హక్కు తమకే కల్పించాలని డిమాండ్ చేశారు.
గంగపుత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మత్స్యశాఖ నుంచి తొలగించాలని కోరారు. మంత్రి ఈటల రాజేందర్‌నూ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంగపుత్ర సంఘం కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం: కేటీఆర్