ETV Bharat / state

జంట నగరాల్లో 54 వేలకు పైగా గణేశ్​ మండపాలు - ministers

గణేశ్​ ఉత్సవాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డిలు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జంట నగరాల్లో ఉత్సవాలు సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

జంట నగరాల్లో 54 వేలకు పైగా గణేశ్​ మండపాలు
author img

By

Published : Aug 23, 2019, 11:05 PM IST

Updated : Aug 23, 2019, 11:12 PM IST

జంట నగరాల్లో 54 వేలకు పైగా గణేశ్​ మండపాలు

గణేశ్​ ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈసారి హస్సేన్ సాగర్ వద్ద గంగాహారతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వేదపండితులతో చర్చించిన అనంతరం గంగాహారతి తేదీ, సమయాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. గణేశ్​ ఉత్సవాల నేపథ్యంలో జంటనగరాల ప్రజాప్రతినిధులు, పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవసమితి ప్రతినిధులతో పాటు ఖైరతాబాద్ గణేశ్​ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. జంట నగరాల్లో 54 వేలకు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని... ఉత్సవాలు సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

26 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు

ఖైరతాబాద్ గణపతి వద్ద తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారని... హుస్సేన్ సాగర్ సహా 26 చెరువుల వద్ద నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవసమితులతో చర్చించి నిమజ్జనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

గిన్నిస్​ రికార్డుకు ప్రయత్నం

ప్రపంచంలోనే పెద్దఎత్తున జరుగుతున్న గణేష్ ఉత్సవాన్ని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తామని కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పండగలు వస్తే భయం ఉండేదన్న హోంశాఖా మంత్రి మహమూద్ అలీ... తెలంగాణ వచ్చాక ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యాఖ్యానించారు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
జోన్లు, సర్కిళ్ల వారీగా సమావేశాలు పెట్టి ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్న జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్... గతంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఈ సారి వాటిని సరిదిద్దుతామని చెప్పారు.

ఇవీ చూడండి: 'గ్రేటర్​లో నీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్'

Last Updated : Aug 23, 2019, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.