ETV Bharat / state

గణేశుడికీ ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...! - గణేశుడికి ఓ బాధ ఉంది...దానికి ఓ లెక్కుంది...

వినాయక చవితి వచ్చేసింది. కానీ గణేశుడికి కొన్ని బాధలు ఉన్నాయట... అందుకు కొన్ని లెక్కలూ ఉన్నాయట. అదేంటి దేవుడికి బాధేంటి అనుకుంటున్నారా... ఏకదంతుడితో పాటు మూషికం కూడా వచ్చి వారి బాధలు చెప్తామంటున్నారు... మీరూ వినండి.

గణేశుడికి ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!
author img

By

Published : Sep 2, 2019, 7:06 AM IST

Updated : Sep 2, 2019, 8:16 AM IST

గణేశుడికి ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!

మూషిక: మా బాస్​ పుట్టినరోజు వచ్చేసింది... త్వరగా వెళ్లి స్వామికి శుభాకాంక్షలు తెలిపాలి. ఇలా అనుకున్నానో లేదో మీరే వచ్చారు స్వామి.... మీకు వినాయక చవితి శుభాకాంక్షలు...

గణేశుడు: ఆ.. ఆ... ఏం పండుగలే మూషికా...!

మూషిక: ఏమైంది స్వామి... మీరు ఇలా నిరుత్సాహా పడుతున్నారు. మీ పండుగ అంటే భూలోకంలో 11 రోజులు మానవులంతా కలిసి ఘనంగా జరుపుకుంటారు. అంతేనా మీకు ఇష్టమైనవన్నీ నైవేద్యంగా పెడతారు. ఇంకెం కావాలి స్వామి..!!

గణేశుడు: నా పేరు చెప్పుకుని ఎన్ని ఘోరాలు చేస్తారో... నీకు తెలియదు మూషికా...!

మూషిక: అవునా... మీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది.. అసలు వీళ్లు ఏం చేస్తున్నారు?

గణేశుడు: మూషికా.... ఒక్కసారి ఆలోచించు... నన్ను కొంత మంది వారి స్వార్థం కోసం భారీ ఆకారంలో తయారు చేస్తారు. అది కూడా వివిధ రసాయనాలు వాడి... చాలా కలర్​ఫుల్​గా తీర్చిదిద్దుతారు. ఆఖరుగా 11వ రోజు తీసుకెళ్లి నీళ్లలో పడేస్తారు.

మా గంగమ్మ... నన్ను తిడుతుంది. రంగుల రసాయనాలన్నీ ఆమెలో కలిసి... కలుషితమవుతున్నానని...

మూషిక: ఈ మధ్య మట్టి గణపతులు పెడుతున్నారుగా.....

గణేశుడు: ఎక్కడో అక్కడక్కడా మాత్రమే... వీళ్లకి మట్టి గణపతులైతే అందంగా ఉండవని...ఎక్కువ మంది రసాయనాలు వాడేవే కొంటున్నారు.

మూషిక: నిజమా స్వామి?

గణేశుడు: ఏ శుభాకార్యానికైనా... మొదట నన్నే పూజిస్తారు... అంతా బాగానే ఉంది. ఈ 11 రోజులు ఓ నడిరోడ్డుపైనా, ప్రతి గల్లీలోనూ నన్ను పెట్టి పూజిస్తారు. కానీ వచ్చే పోయే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్లు ఈ 11 రోజులు ఇబ్బందులు పడాల్సిందేనా?

మూషిక: అవును స్వామి... కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్​ జామ్​ అవుతోంది.

గణేశుడు: అంతేనా మూషికా... పెద్ద సౌండ్​ పెట్టి... డీజే పాటలతో డ్యాన్స్​లు... నావి పెద్ద చెవులు అయ్యాయి కాబట్టి బతికిపోయా... అదే మనిషిలా ఉండుంటే చెవుల్లోంచి రక్తం కారేది.

మూషిక: మీరూ గతేడాది కూడా ఇంకో విషయంపై బాధపడ్డారు గుర్తుకువచ్చిందా స్వామి ?

గణేశుడు: అదీ గుర్తుంది నాకు... బాగా మద్యం సేవించి... కొంత మందైతే.. నాన్​ వెజ్​ కూడా తిని నా ముందుకు వచ్చి ఎగురుతారు. వాళ్లను లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది.

మూషిక: మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి....

గణేశుడు: ఏం చేస్తాం... ఇది కలియుగం... ఒకవేళ దేవుడే వచ్చి చెప్పినా... వీళ్లు వినరు. యే గ్రహాంతరవాసో అనుకుంటారు

మూషిక: స్వామి మీరు దిగులు పడకండి... మీ నాన్న గారికి చెప్పి వారికి బుద్ధి వచ్చేలా చేద్దాం.

గణేశుడు: మరచి పోయావా మూషికా... కథువా ఘటన... మా నాన్న గారి ఆలయంలోనే.. ఓ ఎనిమిదేళ్ల బాలికపై పలు సార్లు సామూహిక అత్యాచారం చేశారు కొంత మంది కామాంధులు. వారిని ముక్కలు ముక్కలుగా నరికినా తప్పులేదు. తలుచుకుంటేనే ఒళ్లంత మండిపోతుంది.

మూషిక: వద్దు స్వామి మీరు ప్రశాంతంగా ఉండండి...

గణేశుడు: ఎలా ఉంటాను మూషికా... భారతదేశాన్ని భారత మాతగా కొలుస్తారు. అలాంటి ఈ దేశంలో అమ్మాయిలకే కాదు.... 9నెలల పసికందులకు రక్షణ లేకుండా పోయింది. అలాంటి వారిని పుట్టించడమే తప్పు.

మాకు పండుగలు పూజలు కాదు... మనుషులంతా కుల, మత, వర్గ భేదాలు లేకుండా... ఒక్కటిగా బతికి పదిమందికి సహాయపడుతూ ఉంటే అదే చాలు.

మూషిక: బాధపడకండి స్వామి... అలాంటి రోజు త్వరలో రావాలని కోరుకుందాం

గణేశుడు: పదా మూషిక అమ్మ పిలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు ఇష్టమని ఉండ్రాళ్లు చేసిందట... వెళ్దాం పద పద....

Last Updated : Sep 2, 2019, 8:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.