ETV Bharat / state

గాంధీలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

పారిశుద్ధ్య కార్మికులకు ప్రకటించిన ప్రోత్సాహక నిధులుతమకు కూడా ఇవ్వాలని కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న 150 మంది స్వీపర్లు విధులు బహిష్కరించారు.

gandhi-hospital-workers-protest
గాంధీలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు
author img

By

Published : Apr 9, 2020, 9:49 AM IST

గాంధీ ఆస్పత్రిలోని 150 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. జీహెచ్​ఎంసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రోత్సాహకాలను తమకు కూడా ఇవ్వాలని ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు.

కరోనా సోకిన రోగులకు సేవలందిస్తూ... నిత్యం ఆస్పత్రిలో గడుపుతున్న తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే ప్రోత్సాహకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ జీవితాలను పణంగా పెట్టి పని చేస్తున్నామని... తమను కూడా గుర్తించాలని వాపోయారు.

ఇవీచూడండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.