కరోనా చికిత్స వివరాలు గాంధీ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 10,205 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపారు. 4,056 మంది కొవిడ్‌తో చేరారని పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకున్న 3,423 మందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 202 మంది చనిపోయారని చెప్పారు.
12 ఏళ్ల లోపు చిన్నారులు 290 మందికి, 135 మంది గర్భిణీలకు చికిత్స అందించాం. ఐసీయూలో చికిత్స పొందిన 1,395 మంది డిశ్చార్జ్ అయ్యారు. న్యూమోనియా ఉండి కరోనా సోకిన 1,842 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశాం. 16 మంది క్యాన్సర్ బాధితులకు కరోనా చికిత్స చేసి నయం చేశాం. కరోనా సోకిన 12 మంది పక్షవాత రోగులకు చికిత్స, 38 మంది హృద్రోగులకు చికిత్స అందించాం. వ్యాధి ఉన్న 54 మందికి కరోనా చికిత్స అందించి డిశ్చార్జ్ చేశాం. కాలేయ సమస్యతో వచ్చిన 24 మందికి చికిత్స అందించాం. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం 88 మంది ఆస్తమా రోగులకు చికిత్స చేశాం.
- గాంధీ ఆస్పత్రి అధికారులు
ఇదీ చూడండి: అమెజాన్‌లోనూ ఇక మద్యం హోం డెలివరీ!