రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కి చెందిన సతీష్ మొదటి భార్య రెండో కూతురు అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రాఖీ పండగకు ఇంటికి వచ్చిన సుప్రియ అనారోగ్యంతో మంచాన పడింది. ప్రైవేటు ఆస్పత్రులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నిన్న ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆస్పత్రిలో చేర్పించినా... రాత్రి వరకు ఎవరూ సుప్రియను పట్టించుకోలేదు. రాత్రి ఒంటి గంట సమయంలో కూతురు అచేతనంగా పడి ఉండటం వల్ల సతీష్ సిబ్బంది వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. స్పందించిన సిబ్బంది సుప్రియను పరీక్షించారు. సుప్రియ శ్వాస తీసుకోవడం లేదని ఎమర్జెన్సీ వార్డుకి తరలించి ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సుప్రియ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స చేస్తే... తమ పాప బతికేదని వాపోయారు.
ఇవీ చూడండి: అర్ధనగ్నంగా కోహ్లీ..! నెటిజన్ల సెటైర్లు