ETV Bharat / state

Gambling dens in hyderabad: కాయ్‌ రాజా కాయ్‌.. పేకాటకు కేరాఫ్ అడ్రస్​గా హైదరాబాద్​ - కాయ్‌ రాజా కాయ్‌

Gambling dens in hyderabad: హైదరాబాద్​ నగరం అడ్డాగా పేకాట స్థావరాలు చాపకింద నీరులా విస్తరించాయి. పెద్దల కనుసన్నల్లో రూ.కోట్లల్లో జూదం కొనసాగుతోంది. మహానగరం పేకాట స్థావరాలకు అడ్డాగా మారుతోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అప్పట్లో హడావుడి చేసిన పోలీసులు తనిఖీలు తగ్గించటంతో పేకాట నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు.

Gambling dens in hyderabad
పేకాటకు కేరాఫ్ అడ్రస్​గా నగరం
author img

By

Published : Mar 13, 2022, 7:41 PM IST

Gambling dens in hyderabad: కొందరు చోటానేతలు, వ్యాపారులు నిర్వాహకులుగా మారి హైదరాబాద్​ నగరాన్ని జూదానికి అడ్డాగా మార్చేశారు. హైదరాబాద్​లోని పలుకాలనీల్లో అపార్ట్‌మెంట్స్, విల్లాలను అద్దెకు తీసుకుని దర్జాగా జూద గృహాలను నడుపుతున్నారు. పండుగలు, వారాంతం, సెలవురోజుల్లో క్యాసినో, మూడుముక్కలాట, పోకర్‌ వంటి వాటితో జూదరులను ఆకట్టుకుంటున్నారు. కళ్లెదుటే రూ.కోట్లలో పందేలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఖరీదైన రిసార్ట్స్​లో విందులు

ఇటీవల మాదాపూర్‌ కావూరిహిల్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో పేకాట స్థావరంపై డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.90 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. గతేడాది నార్సింగి వద్ద ఫామ్‌హౌస్‌లో క్యాసినో, పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతను ఖరీదైన హోటళ్లు, రిసార్ట్స్‌లో విందు, వినోదాలతో ప్రముఖులను ఆకట్టుకునేవాడని తెలిసింది. వారి పేర్లను ఉపయోగించుకుని రోజూ పేకాట నిర్వహించేవాడని పోలీసుల విచారణతో తేలింది. పంజాగుట్ట, గచ్చిబౌలి ఠాణాల్లో అతనిపై పాత కేసులున్నాయని.. పలుమార్లు జైలుకెళ్లొచ్చినా తీరు మారకపోవటంతో గతేడాది డిసెంబరులో ఇతడిపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పీడి యాక్ట్‌ ప్రయోగించారు.

అటవీప్రాంతమే అడ్డా

మెదక్‌ సమీపంలోని నర్సాపూర్‌ అటవీ ప్రాంతాన్ని పేకాట స్థావరాలకు అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ కొంతమందితో కలిసి ఏర్పాటు చేసుకుని పేకాట పందేలు నిర్వహిస్తుంటారు. పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరి కనుసన్నల్లో రోజూ రూ.లక్షల్లో పందేలు నిర్వహిస్తున్నారు.

పేకాట భాగస్వాముల గొడవ.. చివరికి పోలీసులకు

ఇద్దరు భాగస్వాముల మధ్య తలెత్తిన గొడవ ఘర్షణకు దారితీయటంతో విషయం పోలీసుల వరకూ చేరింది. బేగంపేట్‌ పరిధిలోని మోతీలాల్‌ నెహ్రూనగర్‌లో ప్రముఖ వ్యాపారి అనధికారికంగా పేకాట క్లబ్‌ నిర్వాహించేవారు. అక్కడ పందేలు కాసేందుకు వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులే అధికంగా వచ్చేవారని తెలిసింది. పలుమార్లు పోలీసులు దాడులు చేసి అరెస్ట్‌ చేసినా బయటకు రాగానే మళ్లీ పేకాట దందా కొనసాగించేవారు.

గతేడాది 150 మందికి పైగా జూదంలో పాల్గొంటే కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్ట్‌ చేశారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారులను కేసుల నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. సైదాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి. రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు, ఐదు నక్షత్రాల హోటళ్లలో గదులు అద్దెకు తీసుకుంటాడు. ఐదేళ్ల క్రితం ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ప్రముఖ హోటల్‌లో పేకాట నిర్వహిస్తూ అరెస్టయ్యాడు. రూ.25 లక్షల వరకూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇతడి ఆధ్వర్యంలోనే బంజారాహిల్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్, శామీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో వారానికోసారి పేకాట జరుగుతున్నట్లు తెలుస్తోంది. బేగంపేట్, టోలిచౌకి, గోల్కొండ, మాదాపూర్, గచ్చిబౌలి, పటాన్‌చెరువు, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో నివాసాల మధ్య జూదశాలలను ఏర్పాటు చేసి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల నిఘాలో వెల్లడైంది.

ఏజెంట్లదే హవా.. విదేశాలకు క్యూ

జూదంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించటంతో పేకాటరాయుళ్లు శ్రీలంక, గోవా, మలేషియా, సింగపూర్‌లకు వరుస కడుతున్నారు. విదేశాల్లోని క్యాసినో కేంద్రాలకు తీసుకెళ్లేందుకు నగరంలో పదుల సంఖ్యలో ఏజెంట్లున్నారు. వీరి ద్వారానే నగరంలోని ప్రజాప్రతినిధులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయా దేశాలకు చేరుతుంటారు. ఈ ఏజెంట్లు తమ అనుభవం, ప్రముఖులతో పరిచయాలను అవకాశం చేసుకుని నగర, శివారు ప్రాంతాల్లో క్యాసినో, పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారని సైబరాబాద్‌కు చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

వాట్సాప్​లో సమాచారం..

ఏ సమయంలో ఎక్కడ పందేలు నిర్వహిస్తారనే విషయాన్ని వాట్సాప్‌ గ్రూపు ద్వారా చేరవేస్తారు. పోలీసు కేసులు లేకుండా తాము చూసుకుంటామంటూ భరోసానిస్తారు. పేకాటకు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.3000-5000 వరకూ కమీషన్‌ తీసుకుంటారు. డయల్‌ 100 ద్వారా పేకాట స్థావరాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా కొన్నిసార్లు పోలీసులు తేలికగా తీసుకుంటున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న నిందితులు, సొమ్ము కూడా తక్కువ చేసి చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీపీలు స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ భగవత్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ద్వారా వచ్చిన సమాచారంతో డీసీపీల పర్యవేక్షణలో పేకాట నిర్వాహకులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: మహానగరంలో జూదగాళ్లు.. ఎమ్మెల్యే సహా ప్రముఖులు ..90 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.