ETV Bharat / state

థ్రోంబోసిస్​పై అవగాహన... ప్రపంచవ్యాప్తంగా సదస్సులు - awareness of thrombosis under gaman rehabilitation center

థ్రోంబోసిస్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఫౌండేషన్​ అనే స్వచ్ఛంద సంస్థ అక్టోబర్​ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సదస్సులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలు ఈ వ్యాధి గురించి తెలుసుకొని... తగిన జాగ్రత్తలు పాటించాలని సంస్థ సభ్యులు కోరుతున్నారు.

gaman-rehabilitation-and-upsa-presents-global-health-perspectives-on-thrombosis-during-the-covid-pandemic
థ్రోంబోసిస్​పై అవగాహన... ప్రపంచవ్యాప్తంగా సదస్సులు
author img

By

Published : Oct 8, 2020, 6:38 PM IST

Updated : Oct 9, 2020, 10:06 AM IST

వైద్య శాస్త్రంలో సుప్రసిద్ధులుగా పేరు గడించిన పాథాలజీ పితామహుడు రుడాల్ఫ్​ విర్చో జన్మదినం పురస్కరించుకుని... 2014 నుంచి ప్రతీ ఏటా అక్టోబర్​ 13వ తేదీన... అంతర్జాతీయ థ్రోంబోసిస్​​ డే(రక్తం గడ్డకట్టడం) నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ థ్రోంబోసిస్, హెమటోస్టాటిస్ సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి.

ఈ వ్యాధి​పై ప్రజలకు అవగాహన కల్పించి... వ్యాధి బారిన పడకుండా, వచ్చినా ఎలా ఎదిరించాలో తెలుపుతూ..ప్రజల్లో అవగాహన పెంచుతారు. దేశీయంగా డాక్టర్ కుమార్ కొత్తపల్లి, ఆయన టీమ్​తో కలిసి గమన్ స్వచ్ఛంద సంస్థ అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తోంది.

థ్రోంబోసిస్​ వచ్చిన వారికి గుండెలోని ధమనులు, సిరలలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ స్తంభించిపోతుంది. దీనిపై ఎటువంటి నిర్లక్ష్యం తగదని... ఏటా ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు.. చట్ట సవరణలు చేసే అవకాశం!

Last Updated : Oct 9, 2020, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.