ETV Bharat / state

‘కరోనా ఉద్ధృతికి.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం’

దేశంలో ఓ వైపు కరోనా రెండో దశ విజృంభిస్తోంటే.. మరో వైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారంటూ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జల కాంతం కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలకు ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్​ బాధితులకు సరైన వైద్యం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

gajjela kantham fires on central govt
gajjela kantham fires on central govt
author img

By

Published : Apr 23, 2021, 10:09 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని.. ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జల కాంతం మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలకు ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల క్షేమం దృష్ట్యా.. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తలపెట్టిన రాజ్యాంగ రక్షణ సదస్సును నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

దేశంలో ఓ వైపు కరోనా రెండో దశ విజృంభిస్తుంటే.. మరో వైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కాంతం ప్రశ్నించారు. కుంభమేళాకు 15 లక్షల మంది తరలి వెళ్తోంటే.. ప్రధాని, హోంమంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆ కారణంగా లక్షలాది మంది వైరస్‌ బారిన పడ్డారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్​ బాధితులకు సరైన వైద్యం అందడం లేదని.. ఇకనైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్​లు.. త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: 'నిబంధనలు పాటించండి... కొవిడ్​ కట్టడికి సహకరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.