Gadwal Youth Chandrayaan 3 Design : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్-3 మిషన్‌లో 2 పేలోడ్స్ (ఏహచ్వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ రాశారు. కూలి పనులు చేస్తూ.. జీవనం సాగించే ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి కృష్ణ కుమ్మరి, అమ్మాయి శకుంతల. కృష్ణ విద్యాభ్యాసం 1 నుంచి 10 వరకు ఉండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగింది.
Chandrayaan 3 Landing Today : 10వ తరగతి 2008 పూర్తి చేసి.. మూడేళ్లు తిరుపతిలో డీసీఎస్ఈ(డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) చేశాడు. ఈ-సెట్ పరీక్ష రాసి హైదరాబాద్ 2011-2014లో సీఎస్‌ఈ(Computer Science Engineering) చేశారు. కళాశాల ప్లెస్‌మెంట్‌లో భాగంగా టెరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.
Gadwal Young Man in Chandrayaan 3 Designing : ఉద్యోగం చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్‌బీ(ISRO) రాసి ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్ లెవల్ ఉద్యోగం (గ్రూప్ ‘ఏ’ గెజిడెట్ అధికారి) యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC)/ఇస్రోలో ఓ యూనిట్ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ (ఎల్‌ఈఓఎస్) బెంగళూరులో సాధించారు.
చంద్రయాన్-3లో ప్రస్థానం.. : చంద్రయాన్-3కి అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్‌లోని 2 పేలోడ్స్‌లో 5 మంది సభ్యులు పనిచేసినా.. వీటిలో ఎల్‌హెచ్‌వీసీ, ఐఎల్‌ఎస్‌ఏకు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాఫ్ట్‌వేర్ రాసినట్లు చెప్పారు. ఎల్‌హెచ్‌వీసీ అంటే హారిజాంటల్ వెలాసిటీని చెబుతుందని, ఐఎల్‌ఎస్‌ఏ అంటే చంద్రుడి()పై వచ్చే కంపనాలు గుర్తించి రికార్డు చేస్తుందని కృష్ట వివిరించారు. ఈ సాఫ్ట్‌వేర్ పేలోడ్స్ నుంచి వచ్చే డేటాని ఐఎస్‌టీఆర్‌ఏసీ(ISTRAC), బెంగళూరు అందుకుంటుందన్నారు. చంద్రయాన్-3 మిషన్‌కు తాను 6 నెలల పాటు పని చేసినట్లు తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ 100 శాతం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.
క్యారమ్స్‌లోనూ ప్రతిభ : ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్(ఎల్‌ఈఓఎస్), బెంగళూరులో తోటి సెంటిస్టులతో ఆడే క్యారమ్స్ పోటీల్లో రెండేళ్లు వరుసగా ఛాంపియన్‌గా కూడా నిలిచారు. తిరువనంతపురంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏరోస్పేస్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ (NCAQR-2022) కార్యక్రమంలో నేషనల్ వైడ్ మెంబర్‌గా పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
Chandrayaan 3 VS Chandrayaan 2 : ఓటమి నేర్పిన పాఠం.. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ఖాయం!
పోలియోకు ఆయుర్వేద వైద్యం : ఐదేళ్ల వయస్సులో తనకు పోలియో సోకి నరాలు చచ్చుబడ్డాయని.. దీనికి అయిజలోని ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్‌రెడ్డి వద్ద వైద్యం తీసుకున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల వయస్సు వచ్చేసరికి స్వతంత్రంగా లేచి తన పనులు చేసుకునేవాడనని చెప్పారు. దాదాపు 23 సంవత్సరాల పాటు ఆయుర్వేద మందులు వాడినట్లు వివరించారు. తోకవడ్లతో చేసిన గంజి శరీరానికి పూసి.. గంట తర్వాత స్నానం చేస్తే నరాల్లో రక్తప్రసరణ జరిగి కండరాలు వదులు అయ్యేవని చెబుతున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మ నిచ్చారని, తాత స్ఫూర్తితో రాణిస్తున్నట్లు కృష్ణ వివరించారు.
Retired ISRO Scientist on Chandrayaan 3 Launch : ''చంద్రయాన్-3' ప్రయోగం భారత్‌కు చాలా కీలకం''
చారిత్రక ఘట్టానికి భారతావని సిద్ధం.. ల్యాండింగ్‌కు చంద్రయాన్-3 రెడీ.. ప్రపంచం కళ్లు మనవైపే!