హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జీవన్ హెల్త్ ఎమర్జెన్సీ టెక్నాలజీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించింది. ప్రమాదం జరిగినప్పుడు G1 అప్లికేషన్ ఉపయోగించి ప్రథమ చికిత్సతో ప్రాణాలు ఏవిధంగా కాపాడవచ్చు అనే అంశంపై పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్ తదితర అత్యవసర అనారోగ్య సమస్యలతో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని తెలిపారు. గత పది సంవత్సరాల నుంచి 13 లక్షల మంది చనిపోయారని తెలిపారు.సేవ్ టెక్నిక్స్ ద్వారా 50 శాతం ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శిల్పవల్లి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఎమ్మార్వో లావణ్యకు 14 రోజుల రిమాండ్