ETV Bharat / state

పశుపక్ష్యాదులకు సంస్కార వాటికలు... కారణం అదే..!

మనుషులకే కాదు... జంతువులకు అంత్యక్రియలు నిర్వహించాలని అనే అతని ఆలోచనకు గ్రామప్రజలు సై అన్నారు. అనుకున్నదే తడవుగా... పనులు ప్రారంభించి.. మూగజీవాలకు సంస్కార వాటికలను ఏర్పాటు చేశారు.

funnel-homes-for-pets
పశుపక్ష్యాదులకు సంస్కార వాటికలు
author img

By

Published : Aug 12, 2021, 11:40 AM IST

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చదనం... పారిశుద్ధ్యంతో అభివృద్ధి చెందుతున్నాయి. వ్యక్తులు ఎవరు మరణించినా అంతిమ సంస్కారాలు గౌరవంగా ఉండాలని ప్రభుత్వం ప్రతీ గ్రామంలో వైకుంఠాధామాలను ఏర్పాటు చేసింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఓ మండల పంచాయతీ అధికారి అడుగు ముందుకేసి పశుపక్ష్యాదులకు సైతం గ్రామాలలో అంతిమ సంస్కారాలు చేసేలా శ్మశానవాటికలను ఏర్పాటు చేశారు. ఈ వివరాల గురించి తెలుసుకోవాలంటే వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలానికి వెళ్లాల్సిందే.

పశుపక్ష్యాదులకు సంస్కార వాటికలు

ప్రజలకు ఇబ్బంది లేకుండా..

ఏ గ్రామంలోనైనా పశుపక్ష్యాదులు మరణిస్తే గ్రామ శివారులలో పడేస్తారు. దాంతో ఆ కలేబరం దుర్గందం వెదజల్లుతూ ఉంటుంది. దానివల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. 2020 డిసెంబర్​లో ఒక వానరం చనిపోగా... నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతే కాకుండా ఇటీవల ఓ శునకం సైతం మరణించడంతో... దాని యజమాని శునకానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇది గమనించిన మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్​కు మెరుపులాంటి ఆలోచన తట్టింది.

పలు గ్రామాల్లో ఇప్పటికే నిర్వహణ

పశుపక్షాదులకు సైతం గ్రామపంచాయతీలలో కొంత స్థలాలను ఏర్పాటు చేసి... వాటికి సంస్కారవాటికలను ఏర్పాటు చేయాలని ఆలోచించాడు. తన ఆలోచనను మండలంలోని సర్పంచ్​లతో చెప్పి ఒప్పించాడు. దాంతో నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు మూడు చెక్కలపల్లి, కొండాపురం గ్రామాలలో పశుపక్ష్యాదుల కోసం సంస్కార వాటికలు ఏర్పాటు చేసేందుకు పదిగుంటల స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో మూగజీవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు.

పశుపక్ష్యాదులకు అంతిమ సంస్కారాలు చేయడం వల్ల... వాటికి గౌరవమివ్వడం ఒక కారణమైతే... కలేేబరాల నుంచి వచ్చే దుర్గందం నుంచి ప్రజలకు ఇబ్బందులు ఉండవని పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్​ తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని... ప్రతీ గ్రామంలో పశుపక్ష్యాదులకు వాటికలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఎన్​కౌంటర్​- ఇద్దరు క్రిమినల్స్​ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.