ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమం వేదికగా ప్రశ్నించిన ప్రధానోపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్ చేయడం దారుణమని పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న లతీఫ్ మహమ్మద్ ఖాన్‌పై కక్షపూరితంగా సస్పెండ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గత కొంత కాలంగా లతీఫ్ ఖాన్ సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడుగా, పౌరహక్కుల ఉద్యమంలో పని చేస్తున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తీవ్రవాద ముద్ర వేసి... అన్యాయంగా జైళ్లలో నిర్బంధించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం లతీఫ్ ఖాన్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని... లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని నారాయణరావు హెచ్చరించారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ