Hyderabad Tourist Places: సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే... కనుమ పండుగను హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. వరుస సెలవులు రావడంతో ఇంట్లో సరదాగా పండుగ చేశాక... నగరంలోని దర్శనీయ ప్రదేశాలకు అనేక కుటుంబాలు తరలివచ్చాయి. ప్రధానంగా నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, తీగలవంతెన, లుంబినీపార్క్, ఇందిరా పార్క్, ఎన్టీఆర్ గార్డెన్‌కి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎక్కడ చూసినా... కుటుంబసభ్యులతో ప్రధాన ప్రాంతాలు... సందడిగా మారాయి.
తక్కువ రద్దీ..
చాలా రోజుల తర్వాత... నగరంలోని రోడ్లు ప్రశాంతంగా ఉండడంతో పాటు రహదారులపై రద్దీ తక్కువగా ఉండడంతో బయటకువచ్చినట్లు నగరవాసులు చెప్పారు. సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు.. ప్రయాణం చేసేందుకే ఎక్కువ సమయం పట్టేదని తెలిపారు. బయటకు వచ్చిన సమయంలో తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పారు.
పర్యాటకుల సందడి...
ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వద్ద... హుస్సేన్ సాగర్‌లో బోటు షికారుతో పర్యాటకులు సందడి చేశారు. చాలా మంది నగరంలోని అనేక పర్యాటక ప్రదేశాలను చుట్టేశారు. చాలా రోజుల తర్వాత... అన్ని ప్రదేశాలు తిరిగేందుకు అవకాశం వచ్చిందని నగరవాసులు చెబుతున్నారు. రోడ్లు రద్దీగా లేకపోవడం వల్లే చాలా ప్రదేశాలను సందర్శించగలిగామని వివరించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం సండే ఫన్ డే కార్యక్రమాన్ని రద్దు చేసింది. అయినా ఈ ఆదివారం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ సహా పలు పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో కిటకిటలాడాయి.
ఇవీ చూడండి: