ETV Bharat / state

తెలంగాణలో థాయ్‌లాండ్‌ పండ్లు... ఉద్యానశాఖ సన్నాహాలు - తెలంగాణ ఉద్యానశాఖ వార్తలు

హైదరాబాద్‌.. ఇతర నగరాలు, పట్టణాల్లో విదేశీ పండ్ల విక్రయాలు ఇటీవల పెరుగుతున్నాయి. ప్రజలు ఆసక్తితో కొంటున్నారు. అవే పండ్లను తెలంగాణలోనే పండించేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో థాయ్‌లాండ్‌ పండ్లు... ఉద్యానశాఖ సన్నాహాలు

author img

By

Published : Jan 4, 2021, 6:31 AM IST

Updated : Jan 4, 2021, 6:37 AM IST

హైదరాబాద్‌.. ఇతర నగరాలు, పట్టణాల్లో విదేశీ పండ్ల విక్రయాలు ఇటీవల పెరుగుతున్నాయి. ప్రజలు ఆసక్తితో కొంటున్నారు. అవే పండ్లను తెలంగాణలోనే పండించేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌ జామ పండ్ల సాగుతో సత్ఫలితాలు రావడం వల్ల అదే దేశానికి చెందిన ‘థాయ్‌ పింక్‌ పండ్లు’ పండించాలని ఏర్పాట్లు చేస్తోంది.

కశ్మీరీ ఆపిల్‌ బేర్...

వీటిని మనదేశంలో కశ్మీరీ ఆపిల్‌ బేర్‌గా పిలుస్తున్నారు. ‘తెలంగాణ లాల్‌ సుందరి’ అనే బ్రాండు పేరు పెట్టి వీటిని అమ్మేలా పంట సాగు చేయించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగవుతున్న ఆకుపచ్చని ఆపిల్‌ బేర్‌ పండ్లలా ఉండే థాయ్‌ పింక్‌ పండ్లను పండించేందుకు 5 వేల తల్లి మొక్కలను థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. సిద్దిపేట జిల్లా ములుగులో ఈ శాఖకు చెందిన పంటల ప్రయోగ క్షేత్రంలో ఈ మొక్కలు నాటి సాగుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు చేపడుతోంది. ఆసక్తిగల రైతులకు 3 వేల మొక్కలు ఇచ్చి సాగు చేయించి ఇతరులకు చూపాలని నిర్ణయించింది.

తొలిసాగు...

భద్రాద్రి జిల్లా సారపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన కె.రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పంటను తొలుత సాగు చేశారు. గతంలో ఆకుపచ్చని ఆపిల్‌ బేర్‌ పంట సాగు చేసి లాభాలు గడించారు. గత మే నెలలో తెలంగాణ లాల్‌ సుందరి పండ్ల సాగు ప్రారంభించారు. ఎకరానికి రూ.20వేల చొప్పున కౌలు చెల్లించి ఐదెకరాల్లో సాగు ప్రారంభించారు. మొక్కకు రూ.250 వెచ్చించి బంగ్లాదేశ్‌ నుంచి తెప్పించారు.

ఎకరాకు 600 మొక్కలు నాటడంతో కౌలుతో కలిపి రూ.2లక్షల ఆరంభ పెట్టుబడైంది. తర్వాత మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. గత ఆగస్టులో గోదావరి వరదలో తోట మునిగిపోయింది. మళ్లీ ఇప్పుడు పూత, కాత వస్తోంది. కిలో పండ్లను రూ.60కి అమ్మాలని నిర్ణయించినట్లు రాజు చెప్పారు. ఒక్కో పండు రూ.3 లేదా 4 రూపాయలకు అమ్మితే ఎకరానికి రూ.3 లక్షలు వస్తుందన్నారు.

రైతులకు ఆదాయం పెరుగుతుంది...

విదేశీ పండ్ల సాగుకు తెలంగాణ భూములు, వాతావరణం అనుకూలం. థాయ్‌లాండ్‌ పింక్‌ ఫ్రూట్‌ను ఇక్కడ సాగు చేయిస్తాం. ఈ పండు సగటున 60 గ్రాములుంటుంది. ఎకరానికి 600 మొక్కలు నాటితే మొక్కకు 30 కిలోల చొప్పున 18 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర రూ.35 వేలు ఉంది. ఈ ధరకు అమ్మితే రూ.6.30 లక్షలొస్తాయి. తొలి ఏడాది సాగు ఖర్చులు ఎకరానికి రూ.2.30 లక్షలు పోతే నికరంగా రూ.4 లక్షలు మిగులుతాయని తేలింది. రెండో ఏడాది ఒక్కో మొక్క నుంచి రూ.700 చొప్పున ఆదాయం వస్తుంది. సాధారణ ఆపిల్‌ పండుకు రూ.10 నుంచి రూ.20 వెచ్చిస్తున్నాం. అంతకన్నా తక్కువ ధరకు థాయ్‌ పింక్‌ పండ్లు తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.

-ఎల్‌.వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, ఉద్యానశాఖ

ఇదీ చదవండి: కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్‌ బయోటెక్‌

Last Updated : Jan 4, 2021, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.