నేటి నుంచి సచివాలయంలోని వివిధ శాఖలు ఇతర భవనాలకు తరలివెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యుత్, ప్రభుత్వ రంగ సంస్థలు, అటవీ శాఖలను రెండు రోజుల్లోనే ఇక్కడి నుంచి మార్చనున్నారు. బీసీ సంక్షేమ శాఖ మూడు రోజులు, పశుసంవర్థక శాఖ నాలుగు రోజులు, కార్మిక శాఖ ఐదు రోజుల గడువు కోరినట్లు ఆయా శాఖల సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పురపాలక శాఖ ఆరు, పరిశ్రమలు, ఐటీ, నీటిపారుదల, హోంశాఖ వారం రోజులు, న్యాయశాఖ ఎనిమిది రోజులు, ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరా, వైద్య ఆరోగ్య శాఖలు పది రోజుల సమయం కోరాయి.
గగన్ విహార్‌కు తరలించండి..
ప్రాథమిక, ఉన్నత విద్య, రెవెన్యూ, స్త్రీ శిశుసంక్షేమ, గృహ నిర్మాణ శాఖలు నెలరోజుల గడువు కోరాయి. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని భవనాలను అనుమతించగా... వాటికి అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, దస్త్రాలను తరలించనున్నారు. సచివాలయ భవనాలను గగన్ విహార్‌కు తరలించాలని కొందరు ఉద్యోగులు అధికారులను కోరారు.
విస్తృత ప్రచారం..
సచివాలయంలోని శాఖల తరలింపు దృష్ట్యా కొత్త కార్యాలయాలపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా అన్ని జిల్లాల కార్యాలయాలకు లేఖలు రాయనున్నారు. సచివాలయం వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేసి కొత్తగా తరలించిన వాటి బోర్డులను పెద్దగా ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ చూడండి : కొత్తసారసాల ఘటనను ఖండించిన సీపీఐ