రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులలో కొన్ని రోజులుగా పెద్దగా మార్పు లేని కారణంగా ఇకపై వారానికి ఒక్కరోజు మాత్రమే కరోనా కేసుల వివరాలను వెల్లడించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
దాదాపు ఏడాది కాలంగా కొవిడ్ కేసుల వివరాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిబ్బందిని వాక్సినేషన్ కోసం వినియోగించే లక్ష్యంతో ఈ మేరకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రతి వారం జిల్లాల్లో నమోదైన మొత్తం కేసుల వివరాలతో పాటు ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి వివరాలు, హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి వివరాలను తెలపనున్నారు.
ఇదీ చూడండి: భాజపా సునామీలో తెరాస గల్లంతు ఖాయం: తరుణ్‌చుగ్