ETV Bharat / state

హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం - Hyderabad latest news

హైదరాబాద్​లో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అక్కడక్కడ లీకేజీ పనులు జరుగుతున్నందున అంతరాయం కలగనుందని జలమండలి వివరించింది. ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం
author img

By

Published : Dec 15, 2020, 8:55 PM IST

Updated : Dec 15, 2020, 10:58 PM IST

హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల రేపటి నుంచి రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. న‌గ‌రానికి మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న కృష్ణా ఫేజ్-1 కోదండ‌పూర్, నాస‌ర్లప‌ల్లి, గొడ‌కండ్ల గ్రామాల వ‌ద్ద గ‌ల పంప్​హౌస్​ల‌లో 600 ఎమ్ఎమ్ డ‌యా పైపులైన్ పై వాల్వులు అమ‌ర్చడం, 300 ఎమ్ డ‌యా పైపులైన్ లీకేజీని అరిక‌ట్టడం కోసం పనులు జరుగుతున్నట్లు జలమండలి తెలిపింది.

కేడీడబ్యూఎస్పీ ఫేజ్-1 కోదండ‌పూర్ నుంచి గొడ‌కండ్ల వ‌ర‌కు గ‌ల‌ పైపులైన్​కు పలు ప్రాంతాల్లో మ‌ర‌మ్మతులు వంటి త‌దిత‌ర‌ ప‌నుల‌ను చేపడుతుండడం వల్ల మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 36 గంటలు పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

మిరాలం, కిష‌న్​బాగ్, బాల్ షెట్టికేత్, అల్జుబైల్ కాల‌నీ, అలియాబాద్, హ‌ష‌మాబాద్, రియాస‌త్ న‌గ‌ర్, సంతోశ్​న‌గ‌ర్, విన‌య్​న‌గ‌ర్, సైదాబాద్, ఆస్మాన్ గ‌ఢ్, దిల్​సుఖ్​న‌గ‌ర్, చంచ‌ల్ గూడ‌, యాకుత్ పుర‌, మెహ‌బూబ్ మాన్షన్, బొగ్గులకుంట‌, అఫ్జల్‌ గంజ్, హిందీన‌గ‌ర్, నారాయ‌ణ‌గూడ‌, అడిక్ మెట్, శివంరోడ్, చిల‌క‌ల‌గూడ‌ రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటున్నందున ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: సామాన్యులకు షాక్- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర

Last Updated : Dec 15, 2020, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.