హైదరాబాద్ బోరబండ డివిజన్‌లో స్థానిక తెరాస నేతలు ఉచిత తాగునీటి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డివిజన్ తెరాస అధ్యక్షుడు కృష్ణమోహన్, డిప్యూటీ మేయర్ సతీమణి బోరబండ సైట్ వన్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ప్రారంభించారు.
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచితంగా డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో మంచినీటిని అందిస్తున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ప్రతిరోజు ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర