ETV Bharat / state

నుమాయిష్​లో ఉచిత న్యాయ సహాయం, సలహాలు - తెలంగాణ వార్తలు

ఉచిత న్యాయ సహాయం కావాలనే వారికి మంచి అవకాశం.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టాల్ ప్రారంభమైంది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ స్టాల్​లో ఉచితంగా న్యాయ సలహాలు అందించనున్నారు.

Free legal aid advice at hyderabad nampally
నుమాయిష్​లో ఉచిత న్యాయ సహాయం, సలహాలు
author img

By

Published : Jan 9, 2020, 11:18 AM IST

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టాల్ ప్రారంభమయ్యింది. సంస్థ సభ్య కార్యదర్శి జి.వి. సుబ్రహ్మణ్యం ఆ స్టాల్​ను ప్రారంభించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ స్టాల్​లో ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 10 పథకాలను ప్రతిపాదించిందని, దానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆ స్టాల్ వేదికగా పని చేస్తుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. సుశిక్షితులైన న్యాయవాదులు ఇందులో సలహాలు అందించి, పలు వివాదాలను అక్కడే పరిష్కరిస్తారని చెప్పారు. రోజు రోజుకు ఖరీదవుతున్న న్యాయ సలహాలను ఈ స్టాల్ ద్వారా కక్షిదారులు ఉచితంగా పొందవచ్చని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నుమాయిష్​లో ఉచిత న్యాయ సహాయం, సలహాలు

ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.