ETV Bharat / state

ఈ నెల 12 నుంచి ఉచిత తాగునీటి సరఫరా: తలసాని - minister talasani on Free Drinking Water in Ghmc

ఈ నెల 12 నుంచి భాగ్యనగరవాసులకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు అందనుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ వెల్లడించారు.

Free Drinking Water in Ghmc from this month 12th
ఈ నెల 12 నుంచి ఉచిత తాగునీటి సరఫరా: తలసాని
author img

By

Published : Jan 9, 2021, 7:22 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఓ హామీ నెరవేరబోతోంది. నల్లాల ద్వారా 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు నగరవాసులకు అందనుంది. ఈ నెల 12న రెహమత్‌నగర్ బోరబండలో ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్​ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అంతా పెద్ద సంఖ్యలో హాజరై.. జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

మొత్తం 10 లక్షల కనెక్షన్లు ఉండగా.. బస్తీల్లో 2 లక్షలు, బహుళ అంతస్థుల భవనాలు, ఇతర వ్యక్తిగత ఇళ్లు కలిపి 8 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం రూ.500 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే.. తాము రూ.25 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత భాజపా మొహం చాటేసిందని మంత్రి ఆక్షేంపించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో బర్డ్​ఫ్లూ ఆనవాళ్లు లేవు: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.