కరోనా బారిన పడిన వారికి ఉచిత చికిత్స అందించేందుకు సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, నాస్‌కాం, హైసియా తదితర స్వచ్ఛంద సంస్థలు కలిసి కొవిడ్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నాయి. హైటెక్ సిటీ మెడికవర్ ఆస్పపత్రి సమీపంలో ప్రాజెక్టు అష్రే పేరిట కొనసాగతున్న ఈ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా సేవలందిస్తున్నారు.
ఇతరులు కూడా నామమాత్రపు ఛార్జీలతో కొవిడ్ చికిత్స ఈ ఆస్పపత్రిలో పొందవచ్చని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారు 8045811138 నంబర్‌కు ఫోన్ చేసి టెలీ మెడిసన్ సౌకర్యం పొందవచ్చు. మరిన్ని వివరాలకు 9000257058, 9490797925 నంబర్లకు సంప్రదించవచ్చని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు.