Free Bus For Women : రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశ పెట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫేస్టోలోని ఆరు గ్యారెంటీలలో రెండు పథకాలను అమలు చేసింది. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని ద్వారా వారు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు నుంచి రద్దీ పెరిగిందని అందుకు తగినట్లుగా మరిన్ని ఆర్టీసీ బస్సులను ప్రవేశ పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ను మరవద్దు : జగ్గారెడ్డి
Huge Crowd In RTC Buses : పథకం అమలై రెండు రోజులే అయినప్పటికీ అధిక సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. మహిళలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఉచితమనే ప్రకటనతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో విద్యార్థులకు చాలా ప్రయోజనమన్నప్రయాణికులు పని ఉన్నాలేకున్నా కొంతమంది జర్నీ చేయడం వల్ల చిరుఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతుందని అంటున్నారు. ఉచితంలో కొన్ని షరతులు విధిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఆడవారికి కేటాయించిన సీట్లలోనే కాకుండా మేం కూర్చునే సీట్లలో వారు కూర్చుంటున్నారు. టికెట్ తీసుకున్న మేం నిలబడాల్సి వస్తోంది. లేడీస్కు స్పెషల్ బస్సులు పెట్టాలి. ఆ బస్సుల్లో పురుషులు ఎక్కకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు సమయానికి వెళ్లడానికి ఇబ్బంది అవుతోంది. సాధారణ ప్రజలకు కూడా ఇలాంటి పథకాలు వర్తింప జేయాలి." - పురుషులు
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు
సంవత్సరానికి 12000 భృతి ఇవ్వాలి : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల ఐకాస నాయకులు తెలిపారు. అయితే ఈ పథకం వల్ల నష్టపోతున్న మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచిత ప్రయాణంలో వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులలో మాత్రం పరిమితికి మించి ప్రయాణీకులను సిబ్బంది తీసుకువెళ్తున్నారు.
"ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని ఆటో సంఘాల తరపున స్వాగతిస్తున్నాం. ఉచితం ప్రకటించడం వల్ల మా కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. జీవనోపాధి కొల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే మమల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. గత పది సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెంచలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరానికి రూ.12,000 భృతి ఇవ్వాలి. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. గద్దలాగా తన్నుకుపోతున్న ఓలా, ఉబర్ సంస్థలను వెంటనే రద్దు చేయాలి. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి." - రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల ఐకాస నాయకులు
కిక్కిరిసిన నిర్మల్ బస్టాండ్ - సీటు కోసం డ్రైవర్ క్యాబిన్ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు