మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతగానో అవసరమని ఎమ్మెల్సీ కవిత (Mla Kavitha) అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (TCEI) నాలుగో స్త్రీశక్తి అవార్డు (Srishakthi Awards)ల కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణిదేవి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ వినోభా దేవికి స్త్రీ రత్న అవార్డు, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుష్పలతా దేవికి స్త్రీ మూర్తి అవార్డు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనూషకు స్త్రీశక్తి అవార్డులను అందజేశారు.
-
Attended 4th Stri Shakti Awards today to celebrate the achievements and accomplishments of our womenfolk. My best wishes to every women who has empowered us as a community in many ways. pic.twitter.com/4tNAXXHX0b
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Attended 4th Stri Shakti Awards today to celebrate the achievements and accomplishments of our womenfolk. My best wishes to every women who has empowered us as a community in many ways. pic.twitter.com/4tNAXXHX0b
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 12, 2021Attended 4th Stri Shakti Awards today to celebrate the achievements and accomplishments of our womenfolk. My best wishes to every women who has empowered us as a community in many ways. pic.twitter.com/4tNAXXHX0b
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 12, 2021
కుటుంబానికే అవార్డు...
మహిళకు అవార్డు ఇచ్చామంటే.. ఆమె కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నవరాత్రి సమయంలో స్త్రీ శక్తి అవార్డు ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరుకోట్ల మంది పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు నిర్వహిస్తున్నారని.. ఇందులో కేవలం 15 శాతం మాత్రమే మహిళల భాగస్వామ్యంలో నడుస్తున్నాయన్నారు. ఈ 15 శాతంలో 80 శాతం మహిళలు సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తుండగా, మిగిలిన 20 శాతం మంది ప్రైవేట్, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పరిశ్రమలు నిర్వహిస్తున్నారని వివరించారు.
ప్రత్యేక చొరవ తీసుకోవాలి...
పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టిన మహిళలు, ఔత్సాహిక మహిళలకు వీలైనంత సాయపడాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు, యువతకు అన్ని రకాలుగా సలహాలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మహిళా పారిశ్రామిక వేత్తలను ఎమ్మెల్సీ కవిత కోరారు. అంతర్జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్‌కు కార్యదర్శిగా ఎంపికైన తెలుగు మహిళ డా. శాంతికుమారిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం